వెజిటబుల్ నూడిల్స్

నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ నూడిల్స్ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొన్న వాటి కంటే ఆరోగ్యకరం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా మనకు ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు. వీటిని నేను బార్లీ పిండితో చేశాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు.

IMG_4961కావలసిన పదార్థాలు:-
బార్లీ పిండి – మూడు కప్పులు
కూరగాయల ముక్కలు – 2-3 కప్పులు
వెల్లుల్లి – 2-3 రెబ్బలు
అల్లం – చిన్న ముక్క
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్ళు – సరిపడా
నూనె – 3-4 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – తినే కారానికి సరిపడా

IMG_4942 IMG_4943

పొయ్యి మీద మంచి నీళ్ళు పెట్టి బాగా మరిగించాలి.

IMG_4941

IMG_3793

బార్లీ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి.

IMG_2430కారాల పావుల్లో (జంతికల గొట్టం) ఈ పిండిని తీసుకొని నూడిల్స్ లాగా, ఇడ్లీ పాత్రల్లోకి వత్తుకోవాలి.

IMG_4946

 

పిండి అంతా వత్తుకున్నాక, ఇడ్లీ ఉడికించినట్లు ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలి.

IMG_4947

IMG_4949

10 నిమిషాల తర్వాత వెడల్పాటి పళ్ళెంలో విడి విడిగా తీసి చల్లారనివ్వాలి.

IMG_4951కూరగాయలు సన్నగా తరుక్కోవాలి. నేను క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయలు వేశాను. అల్లం, వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

IMG_4953సోయా సాస్, టొమాటో సాస్ రెండు ఒక చిన్న గిన్నెలో కలిపి ఉంచుకోవాలి.

IMG_4955పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.

IMG_4956వేగాక కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్ది సేపు మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు మరీ మెత్తగా మగ్గకుండా చూసుకోవాలి.

IMG_4957 IMG_4958ఇప్పుడు సాస్ పోసి బాగా కలపాలి.

IMG_4959చల్లారపెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి పెద్ద మంట మీద బాగా కలపాలి.

IMG_4960చివరలో అప్పుడే దంచిన మిరియాల పొడి వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది.

వంకాయ-కొత్తిమీర కారం

ఈ వంటకం స్నేహితురాలు చెప్పిన చేసి పంపిన వంట. వాళ్ళ ప్రాంతం (గోదావరి) లో వండుకునే వంటకం.

vankaya16

కావలసిన పదార్థాలు :-
వంకాయలు –  పావు కిలో
కొత్తిమీర  – ఒక కట్ట (మధ్యస్తంగా)
పచ్చిమిర్చి –  4
ఉప్పు  – తగినంత
పసుపు  – చిటికెడు
పొపుదినుసులు
మినప్పు , శనగపప్పు తలొక స్పూన్ , ఆవాలు అరస్పూన్
నూనె ఒక గరిటెడు

vankaya8

vankaya3

పచ్సిమిర్చి, కొత్తిమీర కడిగి మిక్సీ లొముద్దగా చేసుకోవాలి. అవసరమైతె కాస్త నీరు పోసుకోవచ్చు

vankaya2టమాటాలు చిన్న ముక్కలుగా కొసుకొవాలి. వంకాయలు చీరికలుగా నీళ్ళలో తరుక్కోవాలి.

vankaya4మూకుడులో నూనె పొసి వేడెక్కాక పోపుదినుసులు వేయాలి.

vankaya7అవి వేగాక టమాటాలు వేసి మూత పెట్టాలి

vankaya6టమాటాలు మెత్తగా మగ్గాక, పచ్చిమిర్చి ముద్దవేసి పచ్చి వాసన పోయేదాకావేయించాలి. ముద్దలొ బాగా నీరుంటే దగ్గరపడేదాకా మళ్ళీ మూత పెట్టాలి.

vankaya13 vankaya18
ఇది వేగాక వంకాయముక్కలు వేసి ఉప్పు , పసుపు వేసి మూకుడు మీద మూతపెట్టి కొద్దిగా నీరు పోయాలి.

vankaya17నీటి ఆవిరికి వంకాయలు మగ్గిపొతాయి. బాగా కలిపి దింపేసుకోవడమే

వాడప్పం

ఈ వంటకం నేను చిన్నప్పుడు మాకు తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునేవాళ్ళు.వాళ్ళది రాయలసీమలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం. కర్ణాటకలో చేసుకునే వంటకం కావచ్చు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రయత్నించి చూద్దాం అనిపించి చేశాను.

IMG_4934కావలసిన పదార్థాలు :-
బియ్యప్పిండి(కడిగి ఆరబెట్టి పిండి కొట్టించినది) – 1 కప్పు
జీలకఱ్ఱ – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా

IMG_4925

పొయ్యి మీద మందపాటి పాత్రలో అరకప్పు నీళ్ళు ఉప్పు వేసి మరిగించాలి.మరిగాక బియ్యప్పిండి,జీలకఱ్ఱ వేసి బాగా కలపాలి.

IMG_4929తరువాత పొయ్యి ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి బాగా మర్థించాలి.

IMG_4930ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగ చేసుకుని పూరీల్లాగ వత్తుకోవాలి.వత్తుకోవడానికి కఱ్ఱతో లేక పూరీ ప్రెస్ కానీ వాడచ్చు.

IMG_4933

IMG_4932

పిండి అంతా పూరీల్లాగా వత్తుకున్నాక, బాణలిలో నూనె పెట్టి నూనె వేడెక్కాక పూరీల్లాగా వేయించుకోవాలి.

పనసగింజల పచ్చడి

ఇప్పుడు పనసపళ్ళ కాలం కాబట్టి బజార్లో పనసతొనలు విరివిగా దొరకుతున్నాయి. కేరళ వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు పనసగింజలతో ఎన్ని రకాలు వండుతారో తెలిసింది. నాకు అప్పటివరకు వీటిని ఉడికించుకునో లేదా వేయించుకునో తినడం మాత్రమే తెలుసు. ఈ పనసగింజల పచ్చడి చాలా సులువుగా అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంది ప్రయత్నించి చూడండి.

IMG_4924కావలసిన పదార్థాలు :-
పనసగింజలు – 10
పచ్చికొబ్బెర – అర కప్పు
పచ్చిమిరపకాయలు – తినే కారానికి సరిపడా
పులుపుకి – నిమ్మరసం/పచ్చి మామిడికాయ/చింతపండు కొద్దిగా
ఉప్పు తగినంత
పోపుకి
ఆవాలు
జీలకఱ్ఱ
ఎండుమిరపకాయలు
కరివేపాకు
ఇంగువ
నూనె

IMG_4917

పనసగింజలు శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి.

IMG_4918ఉడికిన పనసగింజల పైన ఉండే ప్లాస్టిక్ లాంటి పొర తీసి వేసుకోవాలి.

IMG_4919పచ్చికొబ్బెర చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

IMG_4922మిక్సీజార్‌లో ఉడికించిన పనసగింజలు,పచ్చికొబ్బెర,పచ్చిమిరపకాయలు,ఉప్పు చింతపండో/మామిడి ముక్కలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.నేను పులుపుకోసం చింతచిగురు ముద్ద వేశాను.

IMG_4923చివరగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది.

చింతచిగురు రసం

గతవారం కొద్దిగా వర్షం పడడం వల్ల చింతచిగురు బాగానే దొరుకుతోంది. తెలిసిన వాళ్ళు చాలా చింతచిగురు తెచ్చిచ్చారు. పప్పు,పచ్చడి కాకుండా ఇంకా ఏమేమి వండచ్చు అని ఆలోచిస్తే రసం ఎందుకు చేయకూడదు అనిపించింది. రసంలో ఎలాగూ చింతపండు వాడతాం కదా, దాని బదులు చింతచిగురు వేసి చేసి చూద్దాం అని మొదలుపెట్టాను. బాగా వచ్చింది.

IMG_4900కావలసిన పదార్థాలు :-
చింతచిగురు – గుప్పెడు
టమోటాలు – 2
ఉడికించిన కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
రసం పొడి – 1-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
పోపుకి
నూనె
ఆవాలు
జీలకఱ్ఱ
ఇంగువ
ఎండుమిరపకాయలు
కరివేపాకు

IMG_4894

చింతచిగురు శుభ్రంగా కడిగి, పొయ్యి మీద గిన్నెలో నీళ్ళు వేసి ఉడికించాలి.

IMG_4895బాగా ఉడికాక టమోటా గుజ్జు, ఉడికించిన కందిపప్పు, రసంపొడి,ఉప్పు, బెల్లం వేసి బాగా ఉడికించాలి.

IMG_4897

IMG_4898బాగా ఉడికాక పోపు వేసుకుంటే రసం తయారైనట్లే.

IMG_4899

గోరుచిక్కుడు పచ్చడి

గోరుచిక్కుళ్ళతో పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులువు. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది.

IMG_4884కావలసిన పదార్థాలు:-
గోరుచిక్కుళ్ళు – 1 కప్పు
చనిక్కాయలు – 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు – తినే కారానికి సరిపడా
ఉప్పు – తగినంత
చింతపండు – కొద్దిగా
పోపుకి
కరివేపాకు
ఆవాలు
జీలకఱ్ఱ
ఇంగువ
ఎండుమిరపకాయలు
నూనె

గోరుచిక్కుళ్ళను కడిగి చిన్న ముక్కలుగా వలిచి పెట్టుకోవాలి.

IMG_4874పొయ్యి మీద బాణలి పెట్టి చనిక్కాయలు,శనగపప్పు,ధనియాలు వేయించుకోవాలి.

IMG_4875వేగాక తీసి పక్కన ఉంచి, కొద్దిగా నూనె వేసి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి.

IMG_4876ఎండుమిరపకాయలు వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొంచం నూనె వేసి గోరుచిక్కుళ్ళను మగ్గించుకోవాలి.

IMG_4877 IMG_4878అన్నీ చల్లారాక ఉప్పు,చింతపండు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

IMG_4881 IMG_4882చివరగా పోపు వేసుకుంటే సరిపోతుంది.

ఆవిరి ఉండలు

ఆవిరి ఉండలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా చాలా సులువు. బియ్యం పిండి,జొన్న పిండి, బార్లీ పిండి ఇలా ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను వీటిని బియ్యం పిండితో చేశాను.

IMG_4872

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి – 3 కప్పులు
నీళ్ళు – తగినన్ని
ఉప్పు,కారం – తగినంత
పోపుకు
ఆవాలు
జీలకఱ్ఱ
శనగపప్పు
కరివేపాకు
ఇంగువ
ఎండుమిరపకాయలు
నూనె

పొయ్యి మీద నీళ్ళు పెట్టి బాగా మరిగాక, పిండిలో వేసి బాగా కలపాలి.

Photos 456ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి.

IMG_4858ఈ ఉండల్ని ఇడ్లీ పాత్రలో వేసి 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

IMG_4861ఉడికిన ఉండల్ని తీసి పక్కన పెట్టుకోవాలి

IMG_4864 IMG_4865పొయ్యిమీద మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి, వేడెక్కాక పోపు సామాను వేసుకోవాలి.

IMG_4866పోపు వేగాక ఉడికించిన ఉండలు కూడా వేసి బాగా వేయించాలి.

IMG_4867ఈ ఉండలు బాగా వేగాక ఉప్పు,కారం వేసి కలిపి కొద్దిసేపు ఉంచి, దింపేస్తె సరిపోతుంది.

IMG_4868

IMG_4869

ఆవిరి అప్పడాలు

ఆవిరి అప్పడాలను ఆవిరి మీద ఉడికించి ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు.పులుసులు,సాంబార్‌లోకి చాలా రుచిగా ఉంటాయి. ప్రయత్నించి చూడండి.

IMG_4841

కావలసిన పదార్థాలు
బియ్యం – 1 కప్పు
జీలకఱ్ఱ – కొద్దిగా
ఉప్పు – తగినంత

బియ్యం బాగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి.

IMG_4780మరుసటిరోజు ఉదయాన్నే వడేసి, మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

IMG_4781 IMG_4784దీనిలో తగినన్ని నీళ్ళు పోసి దోశ పిండి కంటే పల్చగా కలుపుకోవాలి.ఇందులో ఉప్పు,జీలకఱ్ఱ వేసి ఉంచుకోవాలి.

IMG_4806ఒక మందపాటి పాత్రలో దాదాపు సగం వరకు నీళ్ళు పోసి, దాని మూతికి ఒక బట్ట కట్టి పొయ్యి మీద ఉంచుకోవాలి.

IMG_4816రెండు చిన్న ప్లేట్లు తీసుకుని వాటిల్లో ఒక స్పూన్ బియ్యం పిండి వేసి ప్లేట్ మొత్తం వచ్చేలా చేసి పెట్టుకోవాలి.

IMG_4813పాత్రలో నుండి ఆవిరి రావడం మొదలవగానే, బట్ట మీద పిండి వేసిన ప్లేట్ పెట్టి, దాని మీద మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి.

IMG_4818IMG_4819అప్పడాలు ఆరబెట్టడానికి ఒక పొడిబట్టను సిద్దం చేసి పెట్టుకోవాలి.2-3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఇంకో ప్లేట్ ఉంచి ఉడికించుకోవాలి.

IMG_4825అంచుల దగ్గర కొద్దిగా స్పూన్‌తో తీస్తే అప్పడం సులువుగా వచ్చేస్తుంది. దీన్ని బట్ట మీద ఆరబెట్టుకోవాలి.

IMG_4828ఇలాగే అన్ని ఉడికించి ఆరబెట్టుకోవాలి.

IMG_4830ఇంట్లోనే బాగా ఆరాక 1-2 గంటలు ఎండలో ఉంచితే సరిపోతుంది.

IMG_4839తినాలనుకున్నప్పుడు కాగే నూనెలో వేసి వేయించుకుని తినెయ్యొచ్చు.

పచ్చిమామిడికాయ షర్బత్

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మామిడికాయ చాలా మంచిది. పచ్చిమామిడి కాయతో షర్బత్ తయారుచేసి నిలువ ఉంచుకుని రోజూ తాగుతూ ఉండొచ్చు.తయారీవిధానం కూడా సులువుగానే ఉంటుంది.

IMG_4772కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు – 4
బెల్లం – దాదాపు అరకిలో
మిరియాలు – 1 టీ స్పూన్
జీలకఱ్ఱ – 1 టేబుల్ స్పూన్
పుదీనా – 1 చిన్న కట్ట
అల్లం – చిన్న ముక్క

పచ్చిమామిడి కాయలు చెక్కు తీసి, చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

IMG_4749 IMG_4750ప్రెషర్ కుక్కర్‌లో మామిడికాయ ముక్కలు, మిరియాలు, అల్లం ముక్క,పుదీనా వేసి, ఒక చిన్న కప్పు నీళ్ళు పోసి రెండు కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి.

IMG_4752జీలకఱ్ఱ ను నూనె లేకుండా వేయించుకుని పెట్టుకోవాలి.

IMG_4755మామిడికాయ ముక్కల గుజ్జు మిక్సీ జార్‌లో తీసుకుని అందులో వేయించిన జీలకఱ్ఱ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

IMG_4756 IMG_4760

IMG_4761

మందపాటి పాత్రలో బెల్లం తీసుకుని (చక్కెర ఇష్టపడేవాళ్ళు చక్కెర వేసుకోవచ్చు) కొద్దిగా నీళ్ళు పోసి కరిగించుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే బెల్లం ఎక్కువ పడుతుంది.

IMG_4766

 

కరిగిన బెల్లంలో మామిడికాయ గుజ్జు వేసి లేత పాకం రాగానే దింపెయ్యాలి.

IMG_4767ఈ పాకాన్ని వడకట్టుకుని పొడి సీసాలో భద్రపరచుకోవాలి.

IMG_4770

IMG_4771

తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో రెండు స్పూన్ల పాకం వేసి బాగా కలిపి తాగెయ్యడమే.

బియ్యం వడియాలు

అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే మా ఊళ్ళో కూడా ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదట్లోనే ఇంత ఎండలు ఉంటే ఇంక మేలో ఎలా ఉండాలో ఏమిటో. అయితే ఇంత ఎండలు కూడా ఒక్కోసారి బాగా ఉపయోగపడతాయి. వడియాలు,అప్పడాలు పెట్టుకోవచ్చు.వడియాలు పెట్టుకోవడం చాలా సులువు.

IMG_4776కావలసిన పదార్థాలు:
బియ్యం – 1 కప్పు
జీలకఱ్ఱ – కొద్దిగా
తెల్ల నువ్వులు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్ళు – 13 కప్పులు

బియ్యం కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి.

IMG_4780పొద్దున్నే బియ్యం వడేసి, మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

IMG_4781 IMG_4782దీన్ని ఒక గిన్నెలో తీసుకుని, 3 కప్పుల నీళ్ళు పోసి ఉంచుకోవాలి.

IMG_4785ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో 10 కప్పుల నీళ్ళు పోసి అందులో ఉప్పు,జీలకఱ్ఱ,నువ్వులు వేసి మరిగించాలి.

IMG_4788నీళ్ళు మరుగుతున్నప్పుడు, నీళ్ళు కలిపి ఉంచుకున్న బియ్యం పిండి వేసుకోవాలి.ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

IMG_4791ఒక అరగంటకు బాగా ఉడికి పోతుంది. తరువాత పొయ్యి మీద నుండి దింపుకోవాలి.

IMG_4796ఒక కాటన్ బట్టను తడిపి బాగా ఎండ తగిలే ప్రదేశంలో పరుచుకోవాలి.

IMG_4800ఈ బట్ట మీద వడియాల పిండిని స్పూన్‌తో కావలసిన సైజ్‌లో వడియాల్లాగా పెట్టుకోవాలి.

IMG_4803ఎండ బాగా ఉంటే సాయంత్రం 4-4:30 లోపు వడియాలు ఎండిపోతాయి.

IMG_4832ఇప్పుడు బట్టను వెనకవైపు తిప్పి, దానిమీద కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి.

IMG_4835 IMG_4836ఇప్పుడు వడియాలు బట్ట మీద నుండి తేలికగా వచ్చేస్తాయి.

IMG_4837ఈ వడియాల్ని ఇంకో పొడి బట్ట మీద వేసుకుని బాగా ఎండే వరకు ఉంచుకోవాలి.

IMG_4838బాగా ఎండిపోయాక డబ్బాలో నిలువ చేసుకుని ఏడాది పొడుగునా వాడుకోవచ్చు.

IMG_4794కావాలనుకున్నప్పుడు కాగుతున్న నూనెలో వేయించుకుంటే బాగా పొంగి రుచిగా వుంటాయి.